ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో రైతుల భూములను లీజ్‌పై తీసుకొని శుద్ధ తవ్వకాలు జరిపి మట్టిని తిరిగి నింపకుండా వదిలేసిన నాచురల్ బ్లీచ్ ఎర్త్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఆదివారం నాడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తవ్వకాల వల్ల ఏర్పడిన గుంతల్లో పశువులు పడిపోతున్నాయని, ప్రశ్నిస్తే దళారులు జైలులో పెడతాం అంటూ బెదిరిస్తున్నారని వారు వాపోయారు.రైతుల సమస్యలపై స్పందించిన బిజెపి మండల అధ్యక్షుడు నవీన్ కుమార్ దళారులను ప్రశ్నించగా తనపై ఫిర్యాదు చేశారని వెల్లడించారు. రైతులు మంత్రి దామోదర్ రాజనర్సింహ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.