సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్య ధిక కేసులు పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కోర్టులో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కేసు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధిక కేసులు పరిష్కరించడానికి చేపట్టాల్సిన చర్యలను వివరించారు.