తిరుమల మొదటి ఘాట్ రోడ్లో 26వ మలుపు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. కారుకు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ముందుగా వెళుతున్న బస్సులు వేగంగా ఢీ కొట్టింది ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో నారావారిపల్లెకు చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు కారు బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది పోలీసులు టీటీడీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.