యూట్యూబ్ లో చూసి మర్డర్ స్కెచ్ వేశారు..ఆ యువతిని క్షుద్ర పూజలకు బలిచ్చినట్లు అందరిని నమ్మించి హైడ్రామా క్రియేట్ చేశారు..యువతిని చంపి ఆ డెడ్ బాడీ వద్ద క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్ళతో హైడ్రామా క్రియేట్ చేసిన ఆ మర్డర్ మిస్టరీ వీడింది.. డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు చాకచక్యంగా చేదించారు..కన్నతల్లి ఆమె ప్రియుడే హంతకులని తేల్చారు.. తండ్రిని, బిడ్డను చంపి కతర్నాక్ క్రైమ్ స్టోరీ క్రియేట్ చేసిన ఆ ఇద్దరు హంతకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. తీగ లాగితే దొంగ కదిలింది.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన డబుల్ మర్డర్ మిస్టరీ వీడింది.. అచ్చం దృశ్యం కథను మరిపించేలా కన్నతల్లి