రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పి సీఈఓ జానకి రెడ్డి, డి ఆర్ డి ఓ జ్యోతి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని ఆనేగుంట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనుల్లో మమేకమై లబ్ధి పొందాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ సోక్ పిట్, పశువుల పాక కు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.