జగిత్యాల రూరల్ మండలం చల్గల్ లో ఏవన్ చికెన్ సెంటర్ నుండి ముదిగంపల్లి ఎస్సీ కాలనీ ,మహా లక్ష్మి ఆలయం వరకు రోడ్డు పాడై, ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రెడ్డి సంఘం వద్ద వరదలకు రోడ్డు తెగిపోగా అట్టి రోడ్డును బాగు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో చల్గల్ గ్రామ ప్రజలు,కుల సంఘాలు సభ్యులు తదితరుల