విశాఖపట్నం సిటీ నగర పోలీస్ కమిషనర్ మేరకు, అనకాపల్లి పోలీసు వారు అందించిన సమాచారం మేరకు నిన్న అనగా తేది 05-09-2025 సాయంత్రం చోడవరం సబ్-జైలు సిబ్బందిపై దాడి చేసి, వారిని గాయపరిచి సబ్ జైలు నుండి తప్పించుకున్న నిందితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చర్యల్లో భాగంగా, విశాఖపట్నం CTF ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో నాలుగు CTF బృందాలు నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ లు, వారి నివాస స్థలాలు మరియు హోటల్ లు, హాస్టల్ లలో గత రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తుండగా,తేది 06-09-2025, SI భరత్ కుమార్, రాంనగర్ గొల్లలపాలెం పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులను పట్టుకున్నారు