ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు పెద్దన్నగా, పేదల పెన్నిధిగా, పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెంలో కాపు కళ్యాణ మండపం గురువారం జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 102 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.57,84,809ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.