అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్ లో వన్ టౌన్ పోలీసుల నిర్వహిస్తున్న గస్తీలో భాగంగా శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ వ్యక్తి నుంచి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న చాక్లెట్ల వ్యవహారంలో నూర్ మొహమ్మద్ అనే వ్యక్తి నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.