గుత్తి మండలం ఊబిచెర్ల లో రంగనాయకులు అనే వ్యక్తికి సర్వే నెంబర్ 99- బి2 లో 3 ఎకరాల 85 సెంట్లు భూమి ఉంది. నాగరాజు, సుధాకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరుకు సమానంగా భూమి రావాలి. అయితే పెద్ద కుమారుడు నాగరాజు తన భార్య సుజాత పేరిట భూమి అంతా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ ఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆనంద్ గుత్తిలోని రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు.