సఖినేటిపల్లి మండలంలోని అప్పనరాముని లంక, రామరాజు లంక గ్రామాల్లో గోదావరి వరద ప్రభావం తీవ్రంగా ఉంది. మూడు రోజులుగా వరిచేలు, కొబ్బరి తోటలు, రొయ్యల చెరువులు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కుళ్లిపోతాయని, ఆక్వా రైతులు కూడా భారీగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.