పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు శనివారం లబోదిబోమంటున్నారు. స్థానిక మార్కెట్ నుంచి ప్రతిరోజూ 6 లారీల టమటా దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. నాణ్యమైన టమాటా జత గంపలు రూ. 650, నాణ్యత లేని టమాటా తక్కువ ధరలకు అమ్ముడుపోతున్నాయి. రసాయనిక ఎరువుల మందులు, రవాణా, వ్యవసాయ కూలీల ఖర్చులు కూడా తమకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.