సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ పరిధిలోని రాయికోడ్ మండల పరిధిలోగల కుష్నూర్ వాగులో వ్యక్తి గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. కృష్ణూర్ గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి లూనాపై వెళ్తూ ఆదివారం సాయంత్రం గురుమిల వాగు వంతెన పై భారీ వాగు ప్రవహిస్తుండగా దాటే క్రమంలో గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాయికోడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.