పుత్తూరు మండలం తడుకు గ్రామంలో స్థానికులు రోడ్డు మధ్యలో వినాయక మండప ఏర్పాటుకు యత్నించారు. అయితే ఎగువ గూలూరు, దిగువ గూలూరు, పొట్టి గుట్టలు, సిరుగురాజు పాలెం గ్రామ వాసులు దీన్ని ఆదివారం అడ్డుకున్నారు. తమ గ్రామాలకు వెళ్లడానికి ఇదొక్కటే మార్గమని వాపోయారు. రోడ్డును బ్లాక్ చేస్తామంటే ఒప్పుకోమని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.