ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని గుండ్లకమ్మవాగు శనివారం ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వస్తున్న భక్తుల భద్రతపై అధికారులు దృష్టి సారించారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అపాయం తలెత్తకుండా ట్రాక్టర్ల సహాయంతో భక్తులను పోలీసులు గుండ్లకమ్మ వాగును దాటించారు. శనివారం కావడంతో దాదాపు 4,000 మంది భక్తులు ఆలయ దర్శనానికి వచ్చారు. గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అప్రమత్తమైన అధికారులు భక్తులకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని రాచర్ల కోటేశ్వరరావు తెలిపారు.