వినాయక నిమజ్జనంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 5వ తేదీన జరుగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 9 రోజుల పాటు ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకున్నారని అన్నారు. నిమజ్జన కార్యక్రమంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం వేళ నిర్వాహకులు, భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు.