వడ్డెరలకు అభివృద్ధి రావాలంటే రాజ్యాంగం, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయవాది టి.ఈశ్వర్ తెలిపారు. మదనపల్లి రోడ్డులో జరిగిన ఏపీ వడ్డెర విద్యావంతుల వేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డెరలు సమాజానికి కీలకమైన సేవలు చేసినప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు.చైతన్య విద్యాసంస్థల ఏజీఎం రమణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 50 లక్షల వడ్డెరలు ఉన్నా ఇప్పటివరకు ఒక్క వడ్డెర ఎమ్మెల్యే కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వడ్డెర వేదిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.