అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లోని పెద్దవడుగూరు మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన ప్రకాష్ అనే 22 సంవత్సరాల యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.