నంద్యాల జిల్లా అవుకు ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 12న మండల సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఇన్ఛార్జి ఎంపీడీవో శ్రీనివాసులు గురువారం తెలిపారు.ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. రెవెన్యూ, విద్య, వైద్య, నీటిపారుదల, విద్యుత్, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ, ఎస్ఆర్బీసీ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.