Download Now Banner

This browser does not support the video element.

నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభ స్థలం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ సత్యనారాయణ

Anantapur Urban, Anantapur | Sep 4, 2025
అనంతపురం పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఈ నెల 10న జరగనున్న సూపర్ సిక్స్ - సూపర్ హిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొననున్నారు. ఉ గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ భారీ బహిరంగ సభ వద్ద పనులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ , ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ , ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు , జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, గుంటూరు మేయర్, ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపి అబ్జర్వర్ కోవెలమూడి రవీంద్ర , స్థానిక టిడిపి నాయకులు పరిశీలంచారు. సభా వేదిక, ప్రజలు, కార్యకర్తల గ్యాలరీలను పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us