అడవుల సంరక్షణ అటవీ అమర వీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నందు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పాల్గొన్నారు.