శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యా సంస్థల విద్యార్థులు తమ గాన కచేరితో అందరిని అలరించారు. ఆదివారం ఉదయం సాయి కుల్వంత్ సభా మందిరంలో విద్యార్థులు శతవర్ష ప్రేమ జ్యోతి పేరిట ఆధ్యాత్మిక సంగీత గాన కచేరి నిర్వహించారు. వివిధ భాషలలో బాబా కీర్తించారు. అద్భుతమైన వీరి గానానికి, సంగీతం తోడవడంతో దేశవిదేశీ భక్తులు మంత్రముగ్ధులయ్యారు. అనంతరం మంగళహారతితో కార్యక్రమం ముగిసింది.