కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ లో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుండి బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం జిల్లా లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన బస్సులను ఆ కార్యక్రమానికి ఉపయోగించడంతో కర్నూలు కొత్త బస్టాండ్ నుండి పల్లెలకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక ఆందోళన చెందుతున్నారు. దీంతో గంటలకొద్ది ప్రయాణికులు బస్టాండ్ లో వేచి చూస్తున్నారు.