ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు బుధవారం సాయంత్రం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగో ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ మద్యం తాగి ఓ మహిళతో గొడవ పడుతుండగా, అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న అజిత్ సింగ్ నగర్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు కూడా జత కలిశారు. వారు ఆ మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఇద్దరిని సస్పెండ్ చేశారు.