జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పరామర్శ జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఇటీవల మాజీ జెడ్పిటిసి కుమారుడు కటిపెళ్లి రాధా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కెనాల్ లో ప్రమాదవశత్తు పడి మృతి చెందిన సంఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాజీ జెడ్పిటిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన సంఘటన బాధాకరమని, శ్రీనివాస్ రెడ్డి కుటుంబం త్వరలో కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, డాక్టర్ అనుఫ్ రావు, నాయన సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.