అనంతపురం నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం సాయంత్రం నగరంలోని వన్ టౌన్ పరిధిలో వాహన తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి ఆయన శనివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు.