తెలుగు రాష్ట్రాలకే కాక భారతదేశానికే గర్వకారణమైన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని మాజీ జడ్పీ చైర్మన్ బాలసుబ్రమణ్యం అన్నారు. వైయస్సార్ ఆశయాలనే లక్ష్యంగా పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందని, తెలుగు రాష్ట్రాల పేద ప్రజల అభ్యున్నతికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.