కడప జిల్లా బద్వేల్-నెల్లూరు హైవేపై ద్వారక వెంచర్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి గాయాలయ్యాయన్నారు. స్థానికులు గాయపడిన వ్యక్తిని బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అతను కింద పడ్డాడా లేక ఎవరైనా గుద్దారా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.