దేవనకొండ మండల పరిధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కరిడికొండ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మాదిగ వెంకటేష్, వెంకటాపురం గ్రామానికి చెందిన తలారి హరిత కుటుంబాలకు పార్టీ సంక్షేమ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5లక్షలు మంజూరైనట్లు మండల టీడీపీ కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, రామచంద్ర నాయుడు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.