మేడ్చల్ మల్కాజిగిరిలో జిల్లా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఫేజ్ సిక్స్ లో శుక్రవారం గణేష్ నిమజ్జనంలో పాత కక్షలు బగుమన్నాయి. రాంబాబు అనే వ్యక్తిపై కారులో వచ్చిన రాజేశ్వరరావు, నాగమల్లేశ్వరరావు ,వెంకట్ కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.