Parvathipuram, Parvathipuram Manyam | Aug 22, 2025
పిల్లలో పుట్టుక,ఎదుగుదల లోపాలు సకాలంలో గుర్తించి,చికిత్స అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. ఎన్.హెచ్ఎమ్ & ఆర్.బి.ఎస్.కె ప్రోగ్రాం లో బాగంగా పార్వతీపురం జిల్లా ఆసుపత్రి దరిలో ఉన్న డిఇఐసి కేంద్రంలో పుట్టుక నుండి 18 ఏళ్ల వరకు ఉన్న బాలలకు సి.హెచ్.డి,గుండె సంబంధిత సమస్యలకు విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రి నుండి పిల్లల కార్డియాలజిస్ట్ డా. అశోక్ రాజు వైద్య బృందం వైద్యారోగ్యశాఖ సూచనల మేరకు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని గుండె సంబంధిత సమస్యలున్న పిల్లలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని శుక్రవారం తెలిపారు.