రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి వైఎస్ఆర్సిపి రబీ సీజన్లో యూరియా కొరత ఉంటుందని తప్పుడు ప్రచారాన్ని రైతుల్లోకి తీసుకొని వెళ్లారని బిజెపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం రాజమండ్రి బిజెపి కార్యాలయంలో మాట్లాడుతూ అది నమ్మిన కొంతమంది రైతులు ముందుగా రబీ సీజన్ కు కావలసిన యూరియాను ఖరీఫ్ లోనే స్టోరేజ్ చేసుకున్నారన్నారు. ఈ కారణం చేత మిగిలిన రైతులకు ఖరీఫ్ లో యూరియా కొరత ఏర్పడిందన్నారు.