మెట్పల్లిలో గణపతి శోభాయాత్రకు మార్గం సుగమం మెట్పల్లి పట్టణంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ఆదేశాల మేరకు, గణపతి నిమజ్జనం రోజున జరిగే శోభాయాత్రకు ఆటంకం కలగకుండా, రోడ్లకిరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను లాడర్ సిబ్బందితో తొలగించి, ట్రాక్టర్ల ద్వారా తరలించారు. ఈ చర్యలకు పట్టణవాసులు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఆరో అక్షయ్ కుమార్, ముజీబ్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.