సైబర్ నేరాలు, మోసాలపై బొమ్మనహాల్ మండలంలోని ఉద్దేహాళ్, బొమ్మనహాల్ కెజిబివి విద్యాలయాల్లో పోలీసులు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో ఎస్ఐ నభిరసూల్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సైబర్ సురక్ష డిజిటల్ వాహనాలు ద్వారా వీడియోలు ప్రదర్శించారు. వీటిని వీక్షించిన గ్రామస్తులు, విద్యార్థులు సైబర్ మోసాగాళ్ళ వలలోపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ సూచించారు. మొబైల్ ఫోన్ వాడే సందర్భంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. లేదంటే సైబర్ వలలో పడే అవకాశం ఉందన్నారు.