శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 233.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అత్యధికంగా చిలమత్తూరు మండలంలో 28.2 మి.మీ, అత్యల్పంగా నల్లచెరువులో 1.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. అమడగూరులో 20.2, అమరాపురం 15.2, గోరంట్ల 14.2, అగళి 13.8, హిందూపురంలో 11.2 మి.మీ వర్షం కురిసిందన్నారు.