క్రీడలు విద్యార్థుల శారీరిక, మానసిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జనజాతి విశ్వవిద్యాలయాలు మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల 4 వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు - 2025 ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని 171 ఆశ్రమ పాఠశాలలు మరియు 28 ఏకలవ్య మోడల్ పాఠశాలల నుండి ఎంపికైన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు.