విద్యార్థులు ప్రొజెక్టర్ ను సద్వినియోగం చేసుకొని ఏకాగ్రతతో చదువుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ లతో కలిసి సందర్శించి సరస్వతి దేవి చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ వారు గత సంవత్సరం మొబైల్ సైన్స్ ల్యాబ్ వాహనాన్ని అందజేశారన్నారు.