ఈరోజు ఆదివారం కావడంతో నగరవాసులు సందర్శక ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ముఖ్యంగా కైలాసగిరి పర్యాటకులతో కిటకిటలాడింది. వారాంతం కావడంతో కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సందడి చేశారు. సందర్శకులు తీన్మార్ డ్యాన్స్‌లు చేస్తూ పాటలతో వీకెండ్‌ను ఎంజాయ్ చేశారు. కైలాసగిరికి వచ్చిన సందర్శకులు రోప్‌వే ఎక్కేందుకు గంటల కొద్దీ క్యూలో నిలబడ్డారు. రోప్‌వే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని పర్యాటకులు తెలిపారు. కైలాసగిరిపై ఉన్న శివపార్వతుల విగ్రహం, ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.