తోటపల్లి గూడూరు మండలం పేడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. పేడూరు, పాపిరెడ్డిపాళెం, నరుకూరు, చింతోపు, ముంగలదొరువు గ్రామాల రైతులకు పేడూరు పీఏసీఎస్ సేవలందిస్తుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడు సొసైటీలకు పాలకవర్గాల నియామకం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది