ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలో బస్సులలో ప్రయాణం చేస్తూ ప్రయాణికుల సొత్తును చోరీ చేస్తున్న కిలాడీ లేడీని ఒంగోలు పోలీసులు అరెస్టు చేసి చోరీ చోత్తును స్వాధీనం చేసుకున్నారు. బస్సులలో సాధారణ ప్రయాణికుల లాగా ఎక్కి ప్రయాణికుల వద్ద నుండి ఆభరణాలు నగదును కాజేస్తున్న మహిళా దొంగను ఒంగోలు సిసిఎస్ మరియు వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకొని నిందితురాలు వద్ద నుండి ఎనిమిది లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు వివరాలను తెలియజేశారు. ముద్దాయి నరసింహ గతంలో రాష్ట్రవ్యాప్తంగా పాలు దొంగతనాల్లో నిందితురాలు గా పోలీసులు గుర్తించారు