Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
అసంఘటిత కార్మికులకు చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని రెండవ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవా కమిటీ అధ్యక్షులు ఎస్.దామోదరరావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అసంఘటిత కార్మికుల సంక్షేమ పధకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ అసంఘటిత రంగం అనధికారిక రంగంలో ఎక్కువగా గ్రామీణ కార్మికులు మరియు పట్టణ కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు.