నంద్యాల జిల్లా బనగానపల్లె కోవెలకుంట్ల పట్టణాల్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక మండప నిర్వాహకులు పలువురు రక్తదాన శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు తల సేమియా చిన్నారులు గర్భిణీల కోసం ఈ శిబిరం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు సేకరించిన రక్తాన్ని నంద్యాల బ్లడ్ సెంటర్ కు అందజేశామన్నారు.. ఈ కార్యక్రమంలో బనగానపల్లె కోవెలకుంటకు చెందిన పలు వినాయక మండపాల నిర్వాకులు , యువతపాల్గొన్నారు