కారు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, మామిడ్యాల గ్రామానికి చెందిన పొట్ట ప్రవీణ్ (23) వృత్తి రీత్యా డెలివరీ బాయ్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం రాత్రి నగరంలో తన విధులు ముగించుకొని ఫ్యాషన్ ప్రో టిఎస్ 36 కే 5841 నెంబర్ ద్విచక్ర వాహనంపై తన గ్రామమైన మామిడ్యాలకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలోని శామీర్ పేట మండలం తుర్కపల్లి పరిధిలోని మహేష్ ఫైర్ వర్క్స్ గోదాము వద్ద తన ఫోను కింద పడిపోయిం