భద్రాచలం కేసీఆర్ కాలని లోని నూతున డబల్ బెడ్రూమ్ ఇళ్లులు ఓయూ రూముల్లాగా ఉపయోగపడుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం లోనే ఇంటి నిర్మాణం పూర్తి అయ్యి కూడా, ఇంకా అర్హులకు ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. తాళాలు వేసిన వాటిని పగల కొట్టి అనేక రకాలుగా జనాలు వాడుతున్నారు.. గదుల్లో మొత్తం చెత్త, చెడారం, కోటర్, బీర్ బాటిళ్లు,పేకాట గాళ్ళకు కూడా అడ్డాగా మారినాయి . అయినా 30/- రూపాయి తాళం వేస్తే పగల కొట్టడం పెద్ద విషయమా...ఇకనైనా ఎమ్మెల్యే కలగచేసుకొని ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకు రావాలని భద్రాచలం ప్రజలు కోరుకుంటున్నారు.