Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మహిళా పోలీసు సిబ్బందికి వాహనాలను అందజేశారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రూపొందించిన వుమెన్ బ్లూ కోల్ట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, ఎస్పీ గారు జెండా ఊపి స్కూటీ ర్యాలీకి ప్రారంభ సూచన చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పోలీస్ స్టేషన్, కాటారం పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ నుంచి ఎంపికైన మహిళా సిబ్బందికి స్కూటీలు కేటాయించారు.