అలరించిన జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీలు మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో శనివారం ఉదయం నుండి నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవాలు ఎంతగానో అలరించాయి. ఆరు విభాగాలలో నిర్వహించిన పోటీలకు జిల్లాలోని వివిధ యాజమాన్యాలకు చెందిన దాదాపు 350 మంది విద్యార్థులు తమ కళా ప్రతిభను ప్రదర్శించరు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి యాదయ్య హాజరై మాట్లాడరు విద్యార్థులు చదువుతోపాటు ఎన్నో అంశాలలో నైపుణ్యాలు కలిగి ఉండాలని, తమలోని నైపుణ్యాలను ప్రదర్శించడానికి కళా ఉత్సవ పోటీలు ఒక చక్కటి వేదిక అని, ఈ వేదికను ఉపయోగించుకావాలన్నారు