చంద్రాయన గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫుల్ బాగ్ ఎక్స్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.