మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి నదిలో దూకి ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కొమురం భీమ్ జిల్లా తిర్యాణి మండలం తలండి గ్రామానికి చెందిన పోలోజు శృతి(44) మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు దండేపల్లి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తహిసుద్దీన్ తెలిపారు. శృతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.