విద్యార్థులకు పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తి కలిగించాలని,పాఠశాలను అందమైన బొమ్మలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులకు అదనపు కలెక్టర్, జిల్లా విద్యా శాఖ అధికారి పింకేశ్ కుమార్ సూచించారు.శుక్రవారం అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులు,మండల అధికారులతో పాలకుర్తి ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ తరగతులను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ క్లాస్ చదువుతున్న విద్యార్థులను పరిశీలిస్తూ, విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలను అడిగి తెలుసుకొన్నారు.ప్రీ ప్రైమరీ తరగతి గదిని పరిశీలించి పిల్లలకు ఆకర్షిణియంగా ఉండే బొమ్మలను పెయింటింగ్ చేయాలని ఏజెన్సీ వారిని ఆదేశించారు