కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం మహాలయ పౌర్ణమి (మాల పున్నం) సందర్భంగా మాంసం ప్రియులతో మటన్, చికెన్ దుకాణాలు కిట కిట లాడాయి. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కంబదూరు, సెట్టూరు మండలాల పరిధిలో మటన్, చికెన్ దుకాణాలు జనాలతో నిండిపోయాయి. మాంసం కోసం జనాలు ఎగబడడంతో చికెన్, మటన్ ధరలను విక్రయ దారులు అమాంతం పెంచేశారు. సాధారణ రోజుల్లో కిలో చికెన్ రూ.200 ఉండేది. రూ.250 కు పెంచారు. మటన్ కిలో రూ.700 నుంచి రూ.750 కు పెంచేశారు. దీంతో మాంసం ప్రియులు ఇబ్బందులు పడ్డారు.